Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
వేముల సాంబయ్య గౌడ్
నవతెలంగాణ-నెక్కొండ
కాంగ్రెస్ పార్టీ జెండా సబ్బండ వర్గాలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం పార్టీ మండలాధ్యక్షుడు బక్కీ అశోక్ అధ్యక్షతన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశాఖపట్నం టూర్ వెళ్లిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ముందు దళితుల విద్యుత్ బకాయిల మాఫీ గురించి ఇచ్చిన హామీ సంగతి ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించినప్పటికీ అదనంగా డెెవలప్మెంట్ చార్జీలు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల సారంగపాణి, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హరి ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి, రెడ్లవాడ ఎంపీటీసీ మాలోత్ రవి, లావుడ్య తిరుమల నాయక్ తదితరులు పాల్గొన్నారు.