Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శృతి
నవతెలంగాణ - ములుగు
టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమెతో పాటు జిల్లా పార్టీ ఇంచార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ బూతులో కమిటీలు వేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని కోరారు. అలాగే రాబోవు ఎన్నికల్లో ములుగు నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగిరెేందుకు కార్యకర్తలను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కష్ణ, గిరిజన మోర్చా రాష్ట్ర పాలసీ రీసెర్చ్ ఇంచార్జి రాజు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపు రమేష్, గాజుల కష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మందల విజరు కుమార్ రెడ్డి, కొండూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.