Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
ఈ నెల 27, 28 తేదీల్లో నాగర్ కర్నూలులో నిర్వహించే టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర విస్తత కమిటీ సమావేశాలు, విద్యా సదస్సు నువిజయవంతం చేయాలని శుక్రవారం పర్వతగిరి ఆదర్శ పాఠశాలలో శుక్రవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మండలాధ్యక్షుడు పాక శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండు నెలల పీఆర్సీ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి, 18విడతలలో చెల్లిస్తామని మాట తప్పడం సరికాదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి నారా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల టీయస్ యూటీఎఫ్ చేస్తున్న నిరంతర పోరాటం వల్లనే ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 27, 28 తేదీలలో జరిగే రాష్ట్ర విస్తత కమిటీ సమావేశాలు, విద్యాసదస్సుకు ఉపాధ్యాయులందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రధానకార్యదర్శి గుండు కరుణాకర్, ఉపాధ్యాయులు మహేందర్, సంపత్, తిరుపతి, రమేష్, గణేష్ కుమార్, స్రవంతి, రాజిరెడ్డి, కష్ణారెడ్డి, ప్రేమ్ కుమార్, శ్రీదేవి, మన్మధ తదితరులు పాల్గొన్నారు.