Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయు నాయకుడు వేల్పుల
సారంగపాణి
నవతెలంగాణ- హన్మకొండ
హనుమకొండ కొత్త బస్టాండ్ ప్రాంతంలోని చిరువ్యాపారులకు జోన్స్ నిర్మించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సారంగపాణి డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండ కొత్త బస్టాండ్ ప్రాంతంలో చిరువ్యాపారుల సంఘం అధ్యక్షులు బిల్లం సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త బస్టాండ్ నుంచి అశోక జంక్షన్ వరకు రోడ్ ప్రక్కన డబ్బాలు వేసుకొని 35ఏండ్లుగా దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన 45కుటుంబాలు చిరు వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే గతేడాది రోడ్ వెడల్పులో భాగంగా వీరికి గ్రౌండ్ లోపల నుంచి జోన్స్ నిర్మించి న్యాయం చేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు చెప్పారు. అయితే వారు హామీ ఇచ్చి ఏడాది గడిచిన నేటి వరకు జోన్స్ నిర్మించకపోవడంతో చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు జోన్స్ నిర్మించి చిరువ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కోమాకుల రవీందర్, ఉపాధ్యక్షులు హరి దాస్యం సురేష్, కార్యదర్శి జిల్లాల శ్రీనివాస్, కోశాధికారి తోట కుమారస్వామి, గుండ రాములు, రెడ్డి,రవి, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.