Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ప్రయివేట్‌కు దీటుగా విద్యను బోధించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన సమగ్ర అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల హాజరు పట్ల శ్రద్ధ వహించాలనాన్రు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులుపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు తగిన వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. గిరిజన గ్రామాల్లోని గిరిజన విద్యార్థులు ఆశ్రమ స్కూల్లో చదువుకునే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు.
ప్రయివేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ఆశ్రమ పాఠశాలలో విద్యను బోధించాలని, అందుకు ఉపాధ్యాయులు కషి చేయాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా అందించాలన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న విద్యార్థులకు ఎక్కువ శాతం ఆహారం అందించాలన్నారు. బడ్జెట్ తక్కువ ఉంటే అదనపు బడ్జెట్ ఇవ్వడానికి సిపారసు చేస్తానని ఆయన తెలియజేశారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. చదువు పట్ల తగిన ఆక్టివిటీస్ అందించి విద్యార్థులకు శ్రద్ద కలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ప్రధాన పాత్ర వహిస్తూ విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చొరవ చూపాలన్నారు. ఉపాధ్యాయులు హాజరు, సీఆర్టీసీ ఉపాధ్యాయుల వేతన బిల్స్, కాంటి జెంట్ వర్కర్స్ బిల్స్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
ఆశ్రమ పాఠశాలను నోడల్ ఆఫీసర్స్ సందర్శిస్తారని, తాను కూడా స్వయంగా ప్రతి పాఠశాలను సందర్శిస్తారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రధానోపాధ్యాయులు డైట్ బిల్స్ హాజరు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. పాఠశాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ విద్యార్థుల స్కాలర్షిప్పులు పెండింగ్‌లో ఉండరాదని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దష్టికి తీసుకురావాలని, వాటికి సంబంధించిన రిపోర్టు ఆర్డర్స్ షెడ్యూల్ లో పొందుపరచాలని ఏపీవో వసంతరావును ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీఓ జే వసంతరావు, ఏవో దామోదర స్వామి, డీఎంజీ సీసీ ప్రతాప్ రెడ్డి, ఎస్ఓ రాజ్ కుమార్, ఐటీడీఏ మేనేజర్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.