Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారం మహా జాతర పూర్తయిన నేపథ్యంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం మేడారంలోని ప్రధాన మెడికల్ క్యాంపును ఆయన సందర్శించారు. అనంతరం మేడారం పరిసరాల్లో ఈగలు దోమలు వాలకుండా ఆయన దగ్గరుండి నువాన్, తిమోపాస్ వంటి మందులను పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేడిచేసి కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. వేడి వేడి ఆహార పదార్థాలను ఉపయోగించుకోవాలని స్థానికులను సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీత రామరాజు, ఎన్ వి బి డి సి పి దుర్గారావు, సీహెచ్ఓ, సబ్ యూనిట్ ఆఫీసర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.