Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాలలో అక్రమంగా కొనసాగుతున్న గుడుంబా, గంజాయి, గుట్కా, పేకాట (4జీ) నిర్మూలనకు ప్రతిఒక్కరూ కషి చేయాలని ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు పిలుపునిచ్చారు. పత్తిపాకలో మాదకద్రవ్యాల నివారణపై శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అపరిచిత వ్యక్తులు మాదకద్రవ్యాలను ఆటోలలో రవాణా చేస్తే తమకు సమాచారం అందించాలన్నారు. 4జీ నిర్వహించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా చేపడుతున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, గ్రామాలలోని ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆటోలకు మాదకద్రవ్యాల నివారణపై ముద్రించిన స్టిక్కర్లను అతికించారు. ఈ సదస్సులో ఆటోడ్రైవర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.