Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ గ్రామానికి చెందిన దళిత, లంబాడి రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్‌కి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ గపూర్ మాట్లాడుతూ.. ప్రేమ్ నగర్లో ఎస్సీ, ఎస్టీ రైతులు 50ఏండ్లుగా సర్వేనెంబర్ 427లో 15ఎకరాల భూమి సాగుచేసుకుంటున్నార న్నారు. వారు పట్టాలు ఇవ్వాలని అనేక మార్లు దరఖాస్తులు పెట్టుకున్నా అధికారుల నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఈ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం విరమించు కోవాలన్నారు. ఈ రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్, గిరిజన సంఘం జిల్లా నాయకుడు కొర్ర రాజు, రైతులు గుగులోతు జంపయ్య, కాకి పైడి, అయ్య, గుగులోతు సారయ్య, గూగులోతు శ్రీలత, పెంక ఐలక్క, కాకి సౌందర్య పాల్గొన్నారు.