Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ.
విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అసోసియేషన్ కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బుధవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి ఆయతో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, జీ రాజు (హనుమకొండ జిల్లా ఖజానాధికారి), పుల్లూరు సుధాకర్ ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలక, కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు పులి వీరారెడ్డి, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మస్తాన్ తదితరులకు అభినందనలు తెలిపారు. విశ్రాంత పోలీసు అధికారుల సమస్యలకు పరిష్కారం చూపుతాననన్నారు. అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు అసోసియేషన్ కి కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అసోసియేషన్ కార్యాలయ రిపేర్ కి ఎమ్మెల్యే నిధులు నుండి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పాలక కార్యవర్గ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ నల్లా స్వరూప రాణి, కార్పొరేటర్ సౌదా కిరణ్, ఇతర అధికారులు, నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.