Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళల అండగా ఉంటుందని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అన్నారు. బుధవారం కాశిబుగ్గ పీహెచ్సీలో ఆశ వర్కర్లకు 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్‌తో కలిసి ఆయన స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆశ వర్కర్లు చేసిన సేవలను కొనియాడారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ప్రభుత్వం ఆశలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిందన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సందీప్, డాక్టర్ కిరణ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్, నాయకులు పెండ్యాల సోనీ బాబు, తోట బాలరాజు, మంద రమేష్,, అశోక్, రాజు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
పడమర కోట పీహెచ్సీ పరిధిలోని ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్లను డాక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో 37, 38వ డివిజన్ల కార్పొరేటర్లు భోగి సువర్ణ-సురేష్, బైరబోయిన ఉమ - దామోదర్‌లు బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మాధవ్, ఏఎన్ఎంలు భాగ్య, రాణి, ప్రణీత, రేష్మ, భవాని పాల్గొన్నారు.