Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రేగొండ
గ్రామాల అబివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దామరంచపల్లి గ్రామంలో రూ.25లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల్లో ప్రతివీధికి సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వా నికే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. విద్య,వైద్య రంగంపై ప్రత్యే క దృష్టి సారించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక సదు పాయాల కల్పనకు రూ.3500కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మంజూరు చేస్తారని అన్నారు. ఉద్యోగ భర్తీలతోపాటు దళిత బంధు ఎంపిక జరుగుతుందని అన్నారు. మార్చి తర్వాత మరికొంత మందిని ఎంపిక చేసి దళితబంధు వర్తించేలా చూస్తామని అన్నారు.
ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి భరోసా
ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్భరోసా అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీపీ లక్ష్మి రవి అధ్యక్షతన 82మంది లబ్ధిదారులకు రూ. 82లక్షల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 33మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13లక్షల40వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మి రవి, జెడ్పీటీసీ విజయ, పీఏసీఎస్ చైర్మెన్ విజన్ రావు, సర్పంచ్ జూపాక నీల నీలాంబ్రం, ఎంపీటీసీ బొట్ల కవిత సామ్రాట్, టీఆర్ఎస్ రేగొండ గోరుకొత్తపల్లి మండలాల అధ్యక్షులు అంకం రాజేందర్, మట్కె సంతోష్ గ్రామ కమిటీ అధ్యక్షులు కొత్త కృష్ణారెడ్డి, సర్పంచులు శ్రీనివాసరావు, కోఆప్షన్ రియాజ్ పాషా, నాయకులు చంద్రారెడ్డి రజినీకాంత్ బండి కిరణ్ భిక్షపతి పాపిరెడ్డి, తహసీల్ధార్ జి వాకరరెడ్డి, ఎంపీడీవో సురేందర్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అబ్దుల్ రహీమ్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రవీందర్ రావు, పాల్గొన్నారు.