Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మునిసిపల్ కేంద్రంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వరంలో నిర్వహించిన దళితబంధు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ఎమ్మల్యే పాల్గొని మాట్లాడారు. దళితబంధు పేదలకు ఆర్థిక చేయూత నిస్తుందని, చదువుకొని ఖాళీగా ఉన్న వారికి, సొంతంగా వ్యాపారం చేసుకుని ఆర్థిక వద్ధి పొందాలన ఆకాంక్షించారు. లబ్ధిదారులు సరైన ప్రణాళిక ప్రకారం దళిత బంధు ఉపయోగించుకుని ఆర్థిక స్వావలంబన పొందాలన్నారు. నియోజికవర్గంలోని విస్సంపల్లి, బీచ్రాజ్పల్లిలో 100మందిని ఎంపికయ్యారని, త్వరలోనే అందరికి ఈ పథకం అమలు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న ఐదు నియోజిక వర్గాల్లో తొలుత డోర్నకల్ డివిజన్ తొలి జాబితా సిద్దమైందని అన్నారు. ఎంపికైన మరిపెడ మండల బీచ్‌రాజ్‌పల్లి, చిన్నగూడూర్ విస్సంపల్లి గ్రామ లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుని మిగతా వారికి ఆర్శంగా నిలవాలన్నారు. అనంతరరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... దళిత బందు లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్ లు ఏర్పాటు చేయాలని కోరారు. డోర్నకల్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు గాను చిన్న గూడూరు మండలం విసంపల్లి నుంచి 80 మంది, మరిపెడ మండలం బీచురాజుపల్లి నుండి 20 మందిని ఎంపిక చేసి యూనిట్ల ఏర్పాటు పై అవగాహన కల్పించామన్నారు. ఇద్దరు లేదా ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి పెద్ద యూనిట్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, తొర్రూరు ఆర్డీవో రమేష్, డీఆర్డీఓ సన్యాసయ్య, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు, పశు సంవర్థక శాఖ జేడి సుధాకర్, డీహెచ్‌ఎస్‌వో సూర్య నారాయణ, డీఏఓ చత్రు నాయక్, మరిపెడ మునిసిపల్ చైర్మన్ గుగులోత్ సింధూర రవి నాయక్, ఎంపీపీ అరుణ రాంబాబు, జడ్పీటీసీ శారదా రవీందర్, సర్పంచ్‌లు బీర్జులత, నాతి కష్ణ, ఎంపీడీవో శ్యామ్ సుందర్, డీటీవో కె. వేణు, తదితరులు పాల్గొన్నారు.