Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాల యంలోని తన చాంబర్లో కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. వివిధ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాల నుండి ప్రజలు కలెక్టర్ కార్యాల యానికి వస్తారని అన్నారు. పారదర్శకంగా, వేగంగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను పొందుపరిచి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా పెడింగ్ సమస్యలు ఉండవన్నారు. దరఖాస్తుల ప్రోగ్రెస్‌పై ప్రతినెలా రివ్యూ చేసుకోవాలన్నారు. వివిధ పనులపై ప్రజలను పక్కదోవ పట్టిస్తూ దోచుకునే దళారుల నుండి ప్రజలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు సాయిబాబు, మురళీధర్‌రావు, ఎలక్షన్ డ్యూటీ అబ్బాస్, ఈడియం శ్రీకాంత్, హౌసింగ్ ఏఈ రాజలింగు, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.