Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, కనీసం అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని కేవీపీఎస్ మండల అధ్యక్షుడు బల్లెం ఆనందరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొత్తపేటలో మంద దేవదానం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకులు దళితులను కేవలం ఓట్లుగా చూస్తున్నారే తప్ప ఆర్థికంగా నిలబడేలా పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దళితులు నివసించే గూడాలు, పల్లెల్లో అనేక సమస్యలతో సతమతమవు తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళితులు ఉండే కాలనీలలో ఖర్చు చేయకుండా దారిమళ్లించడం సరికాదన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు బ్యాంకులతో సంబంధం లేకుండా దళితుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈర్రి బిక్షం, కడారి విజయ, రవి, రాంబాబు, రాములు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.