Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అన్ని రంగాలలో పిల్లలందరినీ ప్రోత్సహించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కావ్య అన్నారు. బుధవారం బయ్యారం అంగన్వాడీకేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా స్త్రీ పురుషుల సమానత్వం గురించి సమావేశం నిర్వ హించారు. ఆరోగ్యం, చదువు, క్రీడలు, ఉద్యోగాలు తదితర రంగాలలో ప్రోత్స హించాలని అన్నారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, బాల్య వివాహాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ మీరబోయిన కవిత, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త, మహిళలు పాల్గొన్నారు.