Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అమెరికా నాటో కూటమి ఆధిపత్య విధానాల మూలంగా తలెత్తిన ఉక్రెయిన్ రష్యా సైనిక బలగాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసి శాంతి నెలకొల్పే విధంగా ఐక్యరా జ్యసమితి కృషిచేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి జగ్గన్న, మండల కార్యదర్శి బిల్లకంటి సూర్యం అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పై రష్యా సామ్రాజ్యవాద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు . వారం రోజుల నుండి ఉక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాలు కొనసాగిస్తున్న దురాక్రమణ దాడి మూలంగా రెండు దేశాల సైనిక బలగాలతోపాటు ఉక్రెయిన్ సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వివిధ దేశాల విద్యార్థులు ప్రధానంగా భారత దేశ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు. వారికి రక్షణ కల్పించి భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితితో మాట్లాడి వారిని సురక్షితంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లో మరణించిన భారత విద్యార్థి నవీన్‌కు జోహార్లు అర్పించారు. ఇరుదేశాల ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలను కాపాడాలన్నారు. మండల నాయకులు జక్కుల యాకయ్య, నూతక్కి మధుసూదన్ రావు, భక్తుల ధనంజయ, జక్కుల అశోక్, గండు గుట్టయ, వాసంశెట్టి అప్పయ్య, గుర్రం పూర్ణ చంద్ర రెడ్డి, ముత్యాల భద్రయ్య, మేకపోతుల శ్రీను పాల్గొన్నారు.
తొర్రూరు: వారం రోజులుగా ఉక్రెయిన్ దేశం పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్ )ప్రజా పందా ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో బుధవారం దిష్టిబొమ్మ దహనం చేశారు. సబ్ డివిజన్ కార్యదర్శి ముజ పల్లి వీరన్న, పీవైఎల్ నాయకులు బంగారు శ్రీనివాస్, ఐఎఫ్టియు నాయకులు అర్వపల్లి వెంకన్న, కుమార్, నరసింహ, రమేష్, వెంకన్న, చంద్రయ్య, బాబు, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు సంతోష్, గాంధీ, బాలు పాల్గొన్నారు.