Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఈనెల 4వ తేదీ నుంచి 6వతేదీ వరకు వరంగల్ పోలిస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ అండ్ మీట్ 2022 నిర్వహిస్తున్నట్లుగా వరంగ ల్ పోలిసు కమిషనరేట్ డాక్టర్ తరుణ్ జోషి బుధవారం ప్రకటనలో తెలిపారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు ఆటవిడుపుగా ఏటా ఒకసారి వరంగల్ పోలిస్ క్రీడలను నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. మూడ్రోజులపాటు జరిగే పోటీలు ఈనెల 4న హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 9గంట లకు ప్రారంభమవుతాయన్నారు. ఈ క్రీడా పోటీల్లో వివిధ క్రీడాంశాల్లో డివిజనల్ వారీగా పోలీసు అధికారులు సిబ్బంది పోటీ పడను న్నారన్నారు. ఈ క్రీడల్లో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లతోపాటు సిటీ ఆర్మ్డ్ విభాగం, ట్రాఫిక్, సిసిఆర్బి, స్పెషల్ బ్రాంచ్, ఐటి మరియు సైబర్ విభాగాలకు చెందిన పురుష, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారని వెల్లడించారు. ఈ క్రీడల ముగింపు వేడుకలకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా రాను న్నట్లు తెలిపారు. ఈ క్రీడలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ పోటీల్లో పోలీసు క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరారు.