Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15ఏండ్లుగా పేదల ఎదురుచూపులు
- దళారుల చేతిలోకి ఐదెకరాల భూమి
- ప్లాటుకు రూ.10 వేలు వసూలు చేస్తున్న దళారులు !
- నగరంపల్లి గ్రామంలో ఘటన
- న్యాయం చేయాలని పట్టాదారుల వేడుకోలు
నవతెలంగాణ-గణపురం
15 సంవత్సరాల క్రితం నిరుపేద లకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇంటి స్థలాల కోసం పట్టా భూమిని కొనుగోలు చేసి పట్టాలు జారీ చేసింది. భూ పంపిణీ చేయకపోవడంతో ఇప్పటివరకు ఆ భూమి పడావుగా ఉంటోంది. దీంతో కొందరు దళారుల కన్ను ఆ భూమిపై పడింది. సింగరేణి ఓసి త్రీలో ఆ భూములు పోతుండటంతో నలుగురు దళారులు కలిసి నిరుపేదల వద్ద రూ.10,000 ఇస్తే ఇంటి ప్లాట్ ఇస్తామని నమ్మబలికి దాదాపు 70మంది దగ్గర రూ.10వేలు వసూలు చేసిన సంఘటన నగరంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...
గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక పట్టా దారుని వద్ద ఐదెకరాల భూమిని 319.20.21. సర్వే నంబర్లో కొనుగోలు చేసింది. దాదాపు 80 మందికి ఇంటి స్థలాల పట్టాలు కూడా జారీ చేసింది. కానీ, ఆ భూమిలో లో ప్లాటింగ్ చేసి. పట్టాదారులకు భూ పంపిణీ చేయలేదు. దీంతో భూమి 15 సంవత్సరాలుగా పడావుగా ఉంది. ఆ భూమిని కొనుగోలు కేంద్రంకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో సింగరేణి ఓసి త్రీ లో ఆ భూములు పోతుండటంతో. నలుగురు దళారులకు ఆ భూమి మీద కన్ను పడింది. సింగరేణిలో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశతో ఆ ఫ్లాట్ లను 10 వేల రూపాయలకు ఒక ప్లాటు చొప్పున అమ్ముకుంటున్నారు. ఆ దళారులకు ఆ భూమిలో ప్లాట్స్ ఉండటం పట్టా కూడా ఉండటంతో ఈ తతంగాన్ని కొనసా గిస్తున్నారు. వాస్తవానికి 15 ఏళ్లుగా నిరుపేదలకు ఇండ్లు కూడా లేకపో వడంతో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు. చినిగి పోవడం. పోగొట్టుకోవడం లాంటివి జరిగింది. ప్రస్తుతం వారి వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లేవు. పట్టా ఉన్న వారు దాదాపు 30మంది వరకు ఉన్నారు. దీంతో డబ్బు ఇచ్చిన వారికే భూములు ఇస్తామని దళారులు చెప్పడంతో చేసేదేమీలేక దళారుల ఇంటి చుట్టూ డబ్బులు పట్టుకొని క్యూలైన్లు కడుతున్నారు. దాదాపు 150 మంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఆ దళారులువారి బంధువులు. ఇతర గ్రామాలకు చెందిన వారి పేర్లను కూడా వారి లిస్టు లో నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేద వారిని గుర్తించి ఇంటి ప్లాట్లు ఇచ్చి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.