Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో నాయకులు వంగపండ్ల సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కనకా రెడ్డి మాట్లాడారు.58 యేండ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ పింఛను ఇస్తామని రెండో సారి అధికారంలోకొచ్చినా ఇవ్వట్లేదన్నారు. అర్హులకున డబల్ ఇండ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిరుద్యోగులకు భతి అంటూ యువతను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలందరినీ ఏకం చేసి ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కన్వీనర్ మునిగెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు కోడెపాక యాకయ్య, నాయకులు కత్తుల రాజు, గట్ట మల్లారెడ్డి, కుర్ర ఉప్పలయ్య, మంద మహేందర్, పరమేష్ రామగోని ప్రభాకర్, పోలాసు కిష్టయ్య, నాగరాజు సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.