Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరకాల : పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి కోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, వ్యవసాయ మార్కెట్ ఆవరణ, ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలాలను చూశారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఆరున్నర ఎకరాల సువిశాల ప్రదేశంలో ఆసుపత్రి నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు సోదా రామకృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను పాల్గొన్నారు.