Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం
- కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. జిల్లాలో 153 టీంలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య వివరాలను ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని నేటి(గురువారం) నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్స్, తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ములుగు, వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, వాజేడు, తాడ్వాయి మండలాల్లోని 15పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల డాక్టర్స్‌తో హెల్త్ ప్రొఫైల్ సంబంధించిన విషయాలపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల షుగర్, బీపీ, టీబీ, ఆర్బీసీ రక్త నమూనాలను దీర్ఘకాలిక వ్యాధుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు మెడికల్ టీం అట్టి పరికరాలను చెక్ లిస్ట్ రికార్డు చేయాలని సూచించారు.
హెల్త్ ప్రొఫైల్ డ్రైవ్ రన్ కార్యక్రమంలో ప్రతి టీంకి కావాల్సిన ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య పరీక్షల్లో పారదర్శకత పాటించాలన్నారు. రక్త నమూనాలను జాగ్రత్తగా సరియైన సమయంలో ల్యాబ్ కు తరలించే లా ఏర్పాట్లు చేయాలన్నారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన వారికి హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, వైవీ గణేష్, డీఆర్ఓ కే రమాదేవి, డీఎంహెచ్ఓ ఏ అప్పయ్య, డీపీఎంఓ జగన్నాథరెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీష్, ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.