Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ హితానికి దోహదపడాలని ఎన్ఎస్ఎస్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కేసిరెడ్డి అన్నారు. గ్రేటర్ 55వ డివిజన్ కేశవ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిభిరాల వివరాలను, ప్రత్యేక కార్యక్రమాల నివేదికలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కేసిరెడ్డి, కేయూ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణలు మాట్లాడారు. వాలంటీర్లు ప్రత్యేక శిబిరాలలో పాల్గొనడం వల్ల వారిలో సృజనాత్మక శక్తి, సమగ్ర వికాసం అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి, కళాశాల డైరెక్టర్లు సరోత్తంరెడ్డి, ప్రభాకర్, రమేష్, తిరుపతి, ఆర్పీ, వెంకటేశ్వర్లు, క్రాంతి, సతీష్, వాలంటీర్లు పాల్గొన్నారు.