Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈ-హెల్త్ ప్రొఫైల్ నిర్వహణపై గ్రామీణ ప్రజానీకానికి మరింత అవగాహన కల్పించాలని స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి కోరారు. మండలంలోని పాపయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో ఈ-హెల్త్ ప్రొఫైల్ డ్రై రన్ గురువారం నిర్వహించగా జనార్ధన్‌రెడ్డి పరిశీలించి మాట్లాడారు. ఈనెల 5 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ టీం వర్క్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ జంపయ్య, కష్ణయ్య, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మంగపేట : హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని మంగపేట, చుంచుపల్లి, రాజుపేట, నర్సాపురం బోరు, చెరుపల్లి, కొత్త బెస్తగూడెం గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి సంబందించిన ప్రాథమిక ఆరోగ్య వివరాలను సేకరించినట్లు మండల ప్రత్యేక అధికారి తుల రవి, ఎంపీడిఓ కర్నాటి శ్రీధర్ తెలిపారు. గురువారం మండలంలోని పలు గ్రామపంచాయతీలలో వైద్య సిబ్బందితో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య ప్రోఫైల్ వివరాలు సేకరించినట్లు తెలిపారు. గురువారం నుండి ప్రతి గ్రామపంచాయతీలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుండి ఆరోగ్యానికి సంబందించిన ప్రాథమిక ఆరోగ్య వివరాలను వారి ఇంటి వద్ద నుండే సేకరించనునట్లు తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్ లతో పాటు రక్త పరీక్షలు నిర్వహించి అవసర నిమిత్తం అదనపు పరీక్షలను స్థానిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు మధుల, అరుణ, నిఖిత, ఆర్ఐ సునిల్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.