Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
'మన ఊరు-మన బడి' కార్యక్రమం అభినందనీయ మని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆ సంఘం మండల అధ్యక్ష, కార్య దర్శులు సొంటిరెడ్డి, వెంకట్రెడ్డి, రాకేష్కుమార్లతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంతో పాఠశాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. పాఠశాలలకు పారిశుధ్య కార్మికులను నియమించా లని, జీఓ నెంబర్ 317ను సవరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, సాయిలు, ధనలక్ష్మి, ప్రేమలత, నాగేందర్, జనార్ధన్, ఇంద్రసేనారెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు.