Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సహకారంతో ముందుకు పోతున్నామని జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలం లోని వావిలాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బొల్లెపల్లి శ్రీనివాస్‌తో కలిసి జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామా ల్లోని వాడల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తు న్నట్టు తెలిపారు. గ్రామానికి అవసరమైన విద్యుత్ దీపాలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమం లో ఎంపీటీసీ ఆమని మంగ్యానాయక్, ఉపసర్పంచ్ మధుశ్రీనవీ, మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య, రాజ్యతండా సర్పంచ్ రాధిక రమేష్, తదితరులు పాల్గొన్నారు.