Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని అకినేపల్లి మల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వత్సవాయి శ్రీధర్ వర్మ గురువారం ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు 6 లక్షలతో 2 వందల మీటర్ల ప్రహరీ గోడ నిర్మాణంకు పనులు మంజూరీ కాగా నేడు పనులు ప్రారంబించినట్లు తెలిపారు. ప్రహరీ నిర్మాణంలో స్మార్ట్ బిల్ట్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ నిర్మాణం చేపట్టేందుకు హైద్రాబాద్‌కు చెందిన దంతులూరి బంగారు రాజు కంపెనీలకు పనులు అప్పగించినట్లు తెలిపారు. కార్య క్రమంలో జాతీయ మిర్చీ టాస్క్ ఫోర్స్ కమిటి సభ్యులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి, పాఠశాల ప్రధానోపాద్యాయులు నాగేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి రవి, పెసా మొబిలై జర్ డబ్బుల ముత్యాలరావు, గ్రామస్తులు తొండపు శ్రీనివాస్ రెడ్డి, రూప భద్రయ్య, మధార్ సాహెబ్, మొయినుద్దీన్, అంగనవాడీ వర్కర్ అప్పినబోయిన సరళ పాల్గొన్నారు.