Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బుసాపురం గ్రామ అభివద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్యకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పర్యాటక కేంద్రమైన లక్నవరానికి వెళ్లే ప్రధాన మార్గంలో బుస్సాపురం ఉందన్నారు. లక్నవరానికి వెళ్లే వారికి ఆటంకం లేకుండా గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గ్రామంలో రహదారులను పూర్తిస్థాయిలో సీసీ రోడ్లుగా మార్చేందుకు, సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరినట్టు చెప్పారు.