Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నివారణ సాధ్యమని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో రూ.1.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 కమ్యూనిటీ సీసీ కెమెరాలతోపాటు కంట్రోల్ రూంను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెప్పారు. నేరాలు జరిగితే విచారణ సులువౌతుందని తెలిపారు. నేరం జరిగితే సీసీ కెమెరాల్లో రికార్డయిన దశ్యాలు కోర్డులో సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. సీసీ కెమెరాలున్నచోట నేరాలు జరగవని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో ప్రజలకు భద్రత పెరిగిందన్నారు. నల్లబెల్లం, గుట్కా, పీడీఎస్ బియ్యం, వంటి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. నేరాల నియంత్రణలో, శాంతిభద్రతల పర్యవేక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపడం పట్ల సర్పంచ్ కడెం యాకయ్యను, ఎంపీటీసీలను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై గండ్రాతి సతీష్, సర్పంచ్ కడెం యాకయ్య, వార్డు సభ్యుడు జూలూరి జగన్, మాజీ సర్పంచ్ తమ్మెర విశ్వేశ్వర్రావు, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.