Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి గ్రామాల్లోని ఆయా గ్రామాల సొసైటీల అధ్యక్షులు దుబార్ల సాయిలు, సింహాద్రి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో అశోక్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించడంతోపాటు అర్హులకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని, విద్యావంతులైన నిరుద్యోగ యువతకు రూ.30 లక్షల వ్యయంతో గొర్రెల ఫారాలు ఏర్పాటు చేయాలని, మృతి చెందిన కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 50 ఏండ్లకుపైబడ్డ పెంపకందార్లకు రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పెంపకందారులకు సభ్యత్వం అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గుండెబోయిన మధుకర్, పెద్ద బోయిన వెంకన్న, జంగా వీరన్న, బాలకష్ణ, శోభనబోయిన వెంకన్న, జక్కుల యాకయ్య, పెంటయ్య, సంగె యాకయ్య, ఐలయ్య, బుచ్చయ్య, రాజులపాటి యాకయ్య, కందుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.