Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
గ్రామాల అభివద్ధికి ఎల్ఐసీ తోడ్పాటు అందిస్తుందని ఆ సంస్థ వరంగల్ డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ (డీఎంఎం) వెంకటేశ్వరరావు, ఎంఎస్ చిరంజీవి, మహబూబాబాద్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన తైబజార్లో ఆ సంస్థ తరపున సర్పంచ్ యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ వాణి, ఉపసర్పంచ్ యాకయ్యలతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ మాట్లాడారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 50 పాలసీలు చేసిన గ్రామాన్ని బీమా గ్రామంగా ఎంపిక చేసి నిధులు అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో పాలసీల ద్వారా 5 లక్షల ప్రీమియం చెల్లిస్తే రూ.50 వేల రూపాయలు, రూ.7.50 లక్షల ప్రీమియం చెల్లిస్తే రూ.75 వేలు, రూ.10 లక్షల లక్షల ప్రీమియం చెల్లిస్తే లక్ష రూపాయలు గ్రామ పంచాయతీకి అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో తొర్రూర్ బ్రాంచ్ మేనేజర్ సత్తయ్య, ఏబీఎం ప్రవీణ్, విశ్రాంత ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రేమ్ స్వరూప్, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉపేందర్, నర్సింహారావు, శంకర్, స్థానిక ఏజెంట్స్ యూనియన్ సెక్రెటరీ పాశం రమేష్, తిలక్, యాకన్న, రవి, సమత, మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.