Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళా శిశుసంక్షేమ శాఖకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తహసీల్దార్ నాగరాజుకు గురువారం వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంగన్వాడీ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, అంగన్వాడీ ఆయాలకు రూ.8 లక్షలు అమలు చేయాలని, గ్యాస్, కూరగాయలు, సెంటర్ అద్దె బిల్లులను వెంటనే అందజేయాలని, టీఏ, డీఏ బకాయిలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షులు కృష్ణకుమారి, మీనాకుమారి, సమ్మక్క, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.