Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం
- ఆశాలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ..
నవతెలంగాణ- హనుమకొండ చౌరస్తా
ఆశా కార్యకర్తలు టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండలోని కేయూ మొదటి గేట్ ఎదుటనున్న ఫంక్షన్ హాల్లో ఆయన ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభించిన సమయంలో ఆశా కార్యకర్తలు చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. ఆశాల సేవలను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వారి వేతనాలు పెంచినట్టు పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ లలితాదేవి, శ్రీనివాస్, బాబు, కార్పొరేటర్లు గుంటి రజిత శ్రీనివాస్, చెన్నం మధు, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ - ఐనవోలు
గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. ఆశా కార్యకర్తల మనసు తెల్సుకుని కేసీఆర్ వారి జీతాలను పెంచినట్టు పేర్కొన్నారు. ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 3లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హన్మకొండ
కరోనా సమయంలో ఆశా వర్కర్లు అందించిన సేవలు మరువలేనివి 31వ డివిజన్ కార్పొరేటర్ మా మిండ్ల రాజు అన్నారు. గురువారం డివిజన్లో ఆయన ఆశ వర్కర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఆశాల ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలందించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.