Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
ఈ నెల 5న నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 330 పడకల జిల్లా స్థాయి ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ ఆసుపత్రి నిర్మాణ పనులను ఈ నెల 5న మంత్రి హారీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామ స్వామి నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట నర్సయ్య, ఎంపీపీ ప్రకాష్ రావు, జెడ్పీటీసీ స్వప్న శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ-నల్లబెల్లి
మండల కేంద్రంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత ఇంటిలో మండలంలోని ప్రజాప్రతినిధులతో, ముఖ్య నాయకులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్చి 5న ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నర్సంపేట పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ చెట్టుపల్లి మురళీధర్, గందె శ్రీనివాస్ గుప్తా, మద్ది మేడారం ట్రస్ట్ చైర్మన్ చిట్యాల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పరకాల
పరకాల ప్రజల ఆకాంక్ష అయిన వంద పడకల ఆసుపత్రికి ఈ నెల 5న రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు శంకుస్థాపన చేయనున్నట్టు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మొగిళి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసుదన్రెడ్డితోపాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.