Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవి, రచయిత నందిని సిధారెడ్డి
నవతెలంగాణ-సుబేదారి
'తెలంగాణలో నిర్భంద కాలంలో ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని, స్పూర్తిని నింపిన గొప్ప కవి, రచయిత, ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు' అని కవి,రచయిత నందిని సిధారెడ్డి అన్నారు. గురువారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఓపెన్ డయాస్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యాలయం బెంగళూరు, తెలుగు విభాగం యూనివర్సిటీ కళాశాల సంయుక్తంగా ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన త్రో మై విండో (నా దష్టిలో) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జీవితం-సాహిత్యం అనే అంశంపై ప్రసంగించారు. ప్రజలకు ఎక్కడ ఏ రకంగా అన్యాయం జరిగినా ఎదిరించి పోరాడిన గొప్ప ధీశాలి కాళోజీయేనని పేర్కొన్నారు. కవిత్వం రాయడమే కాదు రాసిన దానికి కట్టుబడి ఆచరించిన వ్యక్తి తెలుగు సాహిత్యంలో ఒక్క కాళోజీయేనని కొనియాడారు. తెలుగు సాహిత్యంలో నగర బహిష్కరణకు గురైన వ్యక్తి ఆయన మాత్రమేనన్నారు. నేటి తరం తెలంగాణ విద్యార్ధులు కాళోజీ స్ఫూర్తిని అందిపుచ్చుకుని సమాజం పట్ల చైతన్యవంతులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీని వాస్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ మల్లేష్, అంపశయ్య నవీన్, నాగిళ్ళ, ఏ ఆర్ కష్ణయ్య, రామశాస్త్రి, వీఆర్.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వల్లం పట్ల నాగేశ్వరరావు, మామిడి లింగయ్య,పెద్ది వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.