Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి
- గట్టుమల్లిఖార్జున స్వామి ఆలయ
చైర్మన్ పెరబోయిన రవి యాదవ్
నవతెలంగాణ-వేలేరు
రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో మల్లికుదుర్ల లోని గట్టుమల్లిఖార్జున స్వామి ఆలయ మండప నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరైనట్టు ఆ ఆలయ చైర్మన్ పెరబోయిన రవి యాదవ్ తెలిపారు. గురువారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా సహాకారంతో ఆలయ అభివద్ధితో పాటు బీటీ రోడ్డు నిర్మించుకున్నట్టు చెప్పారు. గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ తదితర పనుల మంజూరుకు కషి చేస్తున్నా మన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదల రాజిరెడ్డి, ఎంపీటీసీ బీ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ గొవింద సురేష్, ధర్మకర్తల మండలి సభ్యులు అమర్ సింగ్, సాయి మల్లు, ఈఓ అద్దంకి నాగేశ్వర్ రావు, అర్చకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.