Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాఘవ రెడ్డి పేట, ఆరెపల్లి, దుబ్యాల, వెలంపల్లి, ఏంపెడు గ్రామాల్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. స్వరాష్ట్రంలో మారుమూల గ్రామాలు పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రతి గ్రామంలో పంచా యతీ భవనాలతోపాటు అంగన్వాడీ, పాఠశాల భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దళితబంధు దేశానికే ఆదర్శమన్నారు. రైతు బంధు, రైతుబీమా తో రైతులను ఆదుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన 26 కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశార. రాబోయే బడ్జెట్లో అర్హులందరికీ నూతన పింఛన్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ ఐలయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, తాసిల్ధార్ షరీఫుద్దీన్, సర్పంచులు చదువు మధురమహేందర్ రెడ్డి, బిల్లాకంటి ఉమెందారావు, వనమ్మా రామచందర్, రాజయ్య, నరసింహారెడ్డి, మహేందర్, శోభారాణి మహిపాల్ రెడ్డి, రమా రవీందర్, లతా రామారావు, శ్రీనివాస్, పి శ్రీనివాస్, మహేష్, సర్వేశామ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.