Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
మారుమూల పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గురువారం పలిమెల మండలం ముక్నూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది కలుగుతోందని రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతుబంధు సమితి సభ్యులు రైతులు కోరారు. గ్రామం నుండి గోదావరినది రూట్లో పంటపొలాల వరకు 2 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు మంజూరు చేస్తున్నానని, త్వరలోనే పంచాయతీరాజ్ ద్వారా పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం తిమ్మేటిగూడెం, ముక్నూర్ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. రెండు అంగన్వాడీ కేంద్రాలను ఒక్కోదానికి రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.10లక్షలత నూతన బిల్డింగ్ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. ప్రస్తుతం 92మంది విద్యార్థులు ఉన్నారని వారి సంఖ్యకు తగ్గటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, అవసరమైతే ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. ఆశ్రమ పాఠశాల చుట్టూ కాంపౌండ్ గేటు ఏర్పాటు చేయడానికి ఐటీడీఏ ద్వారా చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్ వెంట రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, ఎంపీపీ కుర్స బుచ్చక్క, జెడ్పీటీసీ హేమలత, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీడీఓ ప్రకాష్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, పీిఆర్ డీఈ సాయిలు, ఏఈ పాల్గొన్నారు.