Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతితో మూడు వైన్ షాపులకు టెండర్లు వేయగా దక్కించుకున్న నిర్వాహకులు వైన్ షాపులు నెలకొల్పారు. కాగా సిట్టింగ్‌ల కోసం మండల కేంద్రంలోని నిరుద్యోగ యువకులు ముందు కొచ్చారు. వైన్‌షాప్ యజమానులతో నెలకు సు మారు రూ.25వేల ఒప్పందం చేసుకొని సిట్టింగ్‌లు నడుపుతున్నారు. అయితే నెలరోజులుగా వైన్స్ చుట్టూ ఉన్న గృహాల్లో విచ్చలవిడిగా అనుమతి లేకుం డా సిట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో సిట్టింగ్‌ల కోసం ఒప్పందంతో ఏర్పటు చేసుకున్న వారు లబోదిబోమంటున్నారు. కాగా మద్యం షాపుల వ్యాపారులు వారి జేబులు నింపుకునేందుకు సదరు గృహ యజమానులు ఏర్పాటుచేసుకున్న సిట్టింగ్‌లకే విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోప ణలూ ఉన్నాయి. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
అదనంగా రూ.40 దండుకుంటున్నారు : రాజయ్య, బాధితుడు
మా గ్రామ షాప్‌లో రూ.40 అదనంగా తీసు కుంటూ మద్యం విక్రయిస్తున్నారు. ఇదే విషయమై నిలదీస్తే రూ.30 తామే మద్యం షాపుల యజమా నులకు ఇస్తున్నామం టున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలి.