Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యత పాటించకుండానే డ్రయినేజీ నిర్మాణం
- అసంపూర్తిగా రోడ్డు పనులు
- అధికార పార్టీ నాయకుల
జోక్యంతో ఇష్టారాజ్యం !
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండల కేంద్రంలో చేపడుతున్న రోడ్డు, సైడ్ డ్రయినేజీ పనులను కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేపడుతున్నాడని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని జడల్పేట గ్రామం నుండి చిట్యాల మీదుగా మొగుళ్లపల్లి వరకు సుమారు రూ.23 కోట్లతో రోడ్డు మంజూరైంది. కాగా రెండేండ్ల అనంతరం అనేక అవరోధాలు, అవకతవకలతో రోడ్డు ప్రారంభించారు. కాగా రాజకీయ నాయకుల జోక్యంతో రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి. చిట్యాల-మొగుళ్ల పల్లి వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులను సదరు కాం ట్రాక్టర్ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి రోడ్డు పనులు నిలిపేశాడనే విమర్శలొస్తున్నాయి. కాగా సైడ్ డ్రయినేజీల నిర్మాణంలో నాణ్యత పాటించట్లేదని స్థానిక వ్యాపారస్తులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వేసిన తారు రోడ్డు కూడా నెలరోజులకే పగుళ్ళు పట్టిన పరి స్థితి. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా రోడ్డు పనులు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో డబుల్ రోడ్డుకు ఇరువైపులా వేయాల్సిన సైడ్ కాలువ ఒకే వైపు నిర్మాణం చేయడం ఇందుకు నిదర్శనం. అయితే రాజకీయ నాయ కుల కోసం పక్షపాతంగా పనులు చేపడుతున్నారని స్థానికులు పనులు కూడా అడ్డుకున్నారు. అయినా సైడ్ కాలువ నిర్మాణం చేపడుతున్న పరిస్థితి. సుమారు రెండు కిలోమీటర్ల మేర సైడ్ కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ, కిలోమీటర్ వరకే పనులు మంజూరు కావడం, ఒకవైపే సైడ్ కాలువ నిర్మించడం సమస్యగా మారుతోంది. ఇదే విషయం సదరు కాంట్రాక్టర్‌ను అడిగితే ఏంచేసుకుంటారో చేసుకోండంటూ బెదిరిం చడం గమనార్హం. జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కాంట్రాక్టర్‌దే ఇష్టారాజ్యం : గుండా నరహరి, గ్రామస్తుడు
రోడ్డు పనులు రెండు సంవత్సరాల క్రితం మంజూరైనా ఆలస్యంగా పనులు ప్రారంభించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నాడు. దీంతో రోడ్డు వేసిన నెల రోజులకే బీటలు వారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నాడు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.
పనుల్లో నాణ్యత కొరవడుతోంది : ఆముదాలపల్లి శ్రీనివాస్, గ్రామస్తుడు
సైడ్ డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా కాలువలు తీయకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారాజ్యంగా సైడు కాలువలు తీస్తున్నారు. దీంతో వర్షాకాలం సీజన్లో మురుగు నీరు కాలువల గుండా వెళ్లకుండా రోడ్డుపై ప్రవహిస్తోంది. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి.