Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా నోడల్ అధికారి కె దేవరాజం
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఈనెల 23 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించనున్నట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి కే దేవరాజం ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 1997మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1765మంది, ఇందులో జనరల్ సైన్స్ విద్యార్థులు 897మంది, అలాగే ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 349 మంది, ద్వితీయ సంవత్సరం 218మంది మొత్తం 567మంది విద్యా ర్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. టీ-శాట్ ఛానెల్(టెలివిజన్) ద్వారా ఫిబ్రవరి 21 నుచి వీడియో తరగతులు ప్రసారం అవుతు న్నాయన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగిం చుకోవాలని కోరారు. ఏప్రిల్ 11 న ఇంటర్ మొదటి సంవత్సరం, 12న ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉంటాయన్నారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 22 నుండి మే 10 తేది వరకు నిర్వహిస్తామన్నారు.