Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మండలం లోని కుంటలు, చెరువులలో ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భూపాలపల్లి తాసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చెరువుల నుండి రెవెన్యూ , ఇరిగేషన్ మైనింగ్ శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతి పొందకుండా రాత్రివేళలో మట్టి, మొరం తవ్వకాలు జరుపుతున్నారని తన దృష్టికి వచ్చిం దన్నారు. అక్రమ తవ్వకాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ తవ్వకాలను నిరోధించుటకు తహసిల్దార్ కార్యాలయం నుండి సిబ్బందిని నియమించామన్నారు. టీమ్ లీడర్‌గా వీఆర్ఓ ప్రవీణ్(6300144966), వీఆర్ఏ భూతం రాజు(9390844962), వీఆర్ఏ సురువు మొగిలి(6300244136) పీఆర్ఎ పక్కల మొగిలి(9948736924)ని నియమించినట్టు తెలిపారు. ఇక నుండి మండలంలో కుంటలు చెరువుల నుండి మట్టి, మొరం తవ్వకాలు జరిపి తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ న్నారు. అక్రమ తవ్వకాలపై సమాచారం ఉంటే టీంలీడర్ల నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.