Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఏర్పాట్లు పూర్తి : ఆలయ కమిటీ
నవతెలంగాణ-రేగొండ
మండల పరిధి కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మౌత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నేటి నుంచి 20వతేదీ వరకు ప్రత్యఏక పూజలు, నిత్య కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొన నుంది. ఒకప్పుడు బ్రహ్మౌత్సవాల సమయంలో మాత్రమే భక్తుల తాకిడి ఉండేది. కానీ, ప్రస్తుతం నిత్యం సందర్శకులతో ఆలయం కిటకిటలాడుతోంది. బ్రహ్మౌత్సవాలు పురస్కరించుకొని జాతర లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులను కల్పిస్తు న్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ శనివారం తెలిపారు. తాగునీటి సౌకర్యంతోపాటు ఆర్టీసీ బస్ సౌకర్యం, విద్యుత్, వైద్యం తదితర సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ చైర్మెన్ హింగె మహేందర్ తెలిపారు. క్యూలైన్లు స్నానఘట్టాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే జాతరలో విశ్రాంతి గదులు నిర్మాణంతోపాటు ఆలయాలను చుట్టూ సీసీ రోడ్లు, రూ.70లక్షలతో కల్యాణ మండపం, యాగశాల, గోశాల, రూకోటి తో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టామన్నారు.