Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్ణర్సంపేట
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగిన కేటా యింపులు చేయకుండా చిన్న చూపు చూశాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కుమారస్వామి అన్నారు. శని వారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు పుచ్చకాయల కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్సిడీలు ఎత్తేసి రైతులపై భారాలు మోపి కార్పొరేటర్లకు వ్యవసాయ రంగాన్ని అప్పగిస్తున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులను ఆదుకో వాలన్నారు. జనవరిలో కురిసిన అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని అపార నష్టం వాటిల్లిందని అన్నారు. ఇప్పటి వరకు రైతులను ఆదుకున్న పాపానపోలేదన్నారు. వెంటనే మిర్చి రైతుకు రూ.లక్ష, ఇతర పంటలకు ఎకరాకు రూ.50వేలు నష్టప రిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈసంపెల్లి బాబు, సీహెచ్.నర్సింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ముంజాల సాయిలు, కడియాల వీరచారి పాల్గొన్నారు.