Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
దళితబంధు పథకం అర్హులందరికి అందించాలని నిరుపేద దళితులు డిమాండ్ చేశారు. శనివారం వర్ధన్న పేట పట్టణ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సమా చారం అందుకున్న పోలీసులు ఎస్సై రామారావు ఆధ్వర్యంలో అక్క డకు చేరుకొని దళితులకు నచ్చచెప్పి ధర్నా విరమింప చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులకు తెలియకుండా టీఆర్ఎస్ నాయకులు అర్హుల జాబితాను ఎంపిక చేయడం సరికాదన్నారు. పార్టీలో మండల ప్రధాన నాయకుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూన్నడని విమర్శించారు. మండల వ్యాప్తంగా తమ సమీప బంధువులు, సన్నిహితుల పేర్లు మాత్రమే అర్హుల జాబితాలో చేర్చి అర్హులైన దళిత పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రహస్యంగా దళిత బంధు జాబితా ు తయారుచేసి ఎంపిక చేసిన అభ్యర్థుల వద్ద రూ.లక్ష నుండి రూ.రెండు లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో కమిషనర్, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి మండల పరిషత్ అధికారి కలిసి దళిత బంధు లబ్ధిదారుల జాబితాలు తయారు చేయాల్సి ఉండగా, వారి ప్రమేయం లేకుండా పార్టీ నాయకులే దళితబందు లబ్ధిదారుల జాబితా తయారు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ కలగజేసుకుని అర్హుల కు దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.