Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎస్ఐ నిబంధనలు లేకుండా అమ్మకాలు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-గణపురం
గణపురం మండలంలో ప్రయివేట్ వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి నాసిరకం నీటిని సరఫరా చేస్తురన్నట్టు ఆరోపణ లొస్తున్నాయి. సదరు యజమానులు ఇష్టారీతిన కెమికల్స్ కల పడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. అయినా అధికారులు వాటర్ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో వారి దందా ఆరుకాయలు మూడుపువ్వులుగా విరాజిల్లుతున్న పరిస్థితి.
మండల వ్యాప్తంగా 17 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 25 ప్రయివేటు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. గణ పురం, చెల్పూర్, సీతారాంపురం, బుద్ధారం, గాంధీనగర్ తదితర గ్రామాల్లో వాటర్ప్లాంట్ల దందా జోరుగా సాగు తోంది. ఈ ప్లాంట్లకు ఐఎస్ఐ అనుమతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో క్యాన్ నీటిని రూ.20 చొప్పున అమ్ము తూ అందినకాడికి దండుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ పెట్టా లంటే మున్సిపాలిటీ ఆఫీస్‌లో లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అన్ స్టాండేట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఐఎస్ఓ నుంచి అనుమతులు పొందాలి. ఇవేమి పట్టించుకోకుండా అనుమ తులు లేకుండానే వాటర్ ప్లాంట్ యజమానులు మంచినీటి దందా కొనసాగించడం గమనార్హం. దీనికితోడు వాటర్ ప్లాంట్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ లో మైక్రో బయాలజీ కెమిస్ట్రీలు లేకుండా నీటిలోని పీహెచ్‌ను పరీక్షించకుండా వ్యా పారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారే విమర్శలొస్తున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడి నామమాత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఆరోపి స్తున్నారు. వాటర్ క్యాన్లు కూడా పాకురు పట్టి దర్శనమి స్తున్నాయని కొనుగోలు దారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మినరల్ వాటర్ ప్లాంట్ లపై దాడులు చేసి సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.