Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ సీపీ డీక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
యువతను క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహాన్ని అందించడమే పోలీసుల లక్ష్యమని వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. శనివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో వరంగల్ పోలిస్ కమిషనరేట్ అధ్వర్యంలో కాకతీయ బాట్మింటన్ ఛాంపియన్ షిప్-2022 క్రీడలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో విజేతలకు మొత్తం లక్షన్నరకు పైగా నగదు పురస్కా రాలను అందజేయనున్నామని అన్నారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులకు ప్రజల మధ్య సత్స సంబంధాలు ఏర్పాటడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమములో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ, అదనపు డిసిపిలు పుష్ప, వైభవ్ గైక్వాడ్, సంజీవ్,ట్రైనీ ఐపీిఎస్ పంకజ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, శ్రీనివాస్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.