Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
భూసేకరణ పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాల యంలో భూపాలపల్లి ఆర్డీఓ, మల్హర్రావు తాసిల్ధార్తో సమావేశం నిర్వహించి భూసేకరణ కార్యక్రమాలపై సమీక్షించారు. జెన్కో కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి మల్హర్రావు, భూపాలపల్లి, ఘనపూర్ మండలాల్లో సేకరిస్తున్న భూమి వివ రాలను బాధిత రైతుకు ఉన్న మొత్తం భూమి కోల్పోతున్న భూమి వివరాలు సేకరించి పది రోజుల్లో అందించాలన్నారు. తాడిచర్ల గ్రామంలో ఓపెన్ కాస్ట్ వల్ల ఇండ్లు కోల్పోయిన బాధితుల వివరాలు అందించాలన్నారు. గొల్ల బుద్ధారం పంపు హౌస్‌లో భూమి కోల్పోయిన 13 ఎకరాలకు సంబంధించి గొల్ల బుద్ధారం గండి కామారం గ్రామాల రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టా లన్నారు. గడ్డిగానిపల్లి పునరావాసానికి సంబంధించిన ఏర్పాట్లను సింగరేణి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ కూరాకుల స్వర్ణలత, మల్హర్రావు తాసిల్ధార్ శ్రీనివాస్, కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సూపరింటిండెంట్, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.