Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మిక సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు
నవతెలంగాణ-నర్సంపేట
ఈ నెల 28,29న తలపెట్టనున్న దేశవాప్త స్వారత్రిక సమ్మెను జయపద్రం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు కోరారు. శనివారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బోల్ల కొమరయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో కోటంరాజు మాట్లాడారు. 1996 కేంద్ర నిర్మాణ కార్మికుల సమగ్ర చట్టాన్ని, 1979 వలస కార్మికుల చట్టాన్ని రక్షించాలని, కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, మూడేం డ్లుగా కరోనా కారణంగా నిర్మాణ రంగంలో ఉపాధి కోల్పో యిన కార్మికులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యంపై రెండు రోజులపాటు దేశ వ్యాప్త సమ్మె చేయడానికి సంకల్పించామని తెలిపారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పనుల కోసం వలస వెళ్తున్నారన్నారు. ఇటుక బట్టీల వద్ద, క్రషర్ క్వారీలు, బహుళ అంతస్తుల భవనాల వద్ద కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మిక శాఖలో వలస కార్మికుల సమాచారం పొందుపరచకుండా వెట్టి చాకిరి చేయించు కోవడం శోచనీయమన్నారు. 2009 నుండి ఉమ్మడి రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న 60 యేండ్లు నిండిన కార్మికులు ఉన్నారని, 1996చట్టం ప్రకారం ఫించన్ లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ పథకాల ధరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. క్లైయిమ్స్ పరిష్కరిం చడంలో నిర్లక్ష్యం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. కార్మికుల మనుగడకు గుదిబండగా నిలిచిన చట్టాలను వ్యతిరేకిసస్తూ చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతగిరి రవి, జిల్లా సహాయ కార్యదర్శి తొగటి సీఐ టీయు పట్టణ కార్యదర్శి గుజ్జుల వెంకన్న, బ్రహ్మచారి, జిల్లా ఉపా ధ్యక్షులు జింకల సారంగం, జిల్లా కోశాధికారి బండి ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి నారాయణ, ఎండీ. అమీరుద్దీన్, సాయిబాబు, రాంబాబు పాల్గొన్నారు.