Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ అన్నారు. మండలంలోని రామన్నగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వార్షికోత్సవం నిర్వహించగా ప్రధానోపాధ్యాయులు లింగమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన రవీందర్ మాట్లాడారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో ప్రభుత్వ బడులను కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పాఠశాలల అభివద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ రాము నాయక్, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ సుమలత, ఉపసర్పంచ్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆకుతోట సంతోష్, రాజేందర్, పూర్వ విద్యార్థి నాగరాజు, ఉపాధ్యాయులు రమేష్, బుచ్చిరాములు, బాలు, యాదగిరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.