Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
కేసుల్లో కక్షిదారులు రాజీ కుదుర్చుకోవడమే రాజమార్గమని ములుగు జూనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ మండల చైర్మెన్ నాదెళ్ల రాంచందర్రావు తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా రాంచందర్రావు, ఏపీపీ పావని హాజరై పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాంచందర్రావు మాట్లాడారు. క్రిమినల్, సివిల్, బ్యాంక్, మోటార్ వెహికల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్, తదితర రాజీ పడ దగిన కేసుల్లో ఇరుపక్షాలు సమన్వయంతో వ్యహరించాలని సూచించారు. తద్వారా గొడవలు పరిష్కారం కావడమే కాకుండా శాంతి నెలకొంటుందని చెప్పారు. అనంతరం సీఐ గుంటి శ్రీధర్, ఎస్ఐ ఓంకార్ యాదవ్ మాట్లాడారు. కేసులను రాజీ చేసుకుంటే మేలని, కోర్టుల చుట్టూ తిరిగితే ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ బాలుగు చంద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రవర్తుల వేణుగోపాలచారి, న్యాయవాదులు నర్సిరెడ్డి, మస్రగాని వినరుకుమార్, మేకల మహేందర్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.